Mittapalli surrender biography of michael
మిట్టపల్లి సురేందర్
మిట్టపల్లి సురేందర్, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గీతరచయిత. తెలంగాణ ఉద్యమానికి పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి సురేందర్. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని తన పాటల ద్వారా బోధించినోడు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాల మీద అతను రాసిన "రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట" బహుళ ప్రజాదారణ పొందింది. దర్శకులు ఆర్.నారాయణమూర్తి ఆ పాటను తన పోరు తెలంగాణ (2011) చిత్రంకోసం వాడుకున్నారు. అదే పాటకుగానూ 2011లో సురేందర్ నంది పురస్కారం అందుకున్నాడు. సురేందర్ ఇప్పటివరకు దాదాపు 300ల పాటలు రాశారు. అందులో 20 పాటలు తొమ్మిది సినిమాలకు రాసినవి ఉన్నాయి.
జీవిత విశేషాలు
[మార్చు]మధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలం, వెల్లంపల్లి గ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. అతను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటాడు సురేందర్. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్ఫూర్తిని అంటాడు. సురేందర్ సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటా ఆదరణ పొందాయి. సురేందర్ ప్రైవేట్ సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా పాటలు రాసాడు. నాన్స్టాప్, ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి చిత్రాల్లో సినీగీతాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నాడు.[1]
సినీ జీవితం
[మార్చు]మిట్టపల్లి సురేందర్ 2005లో ‘ధైర్యం’ సినిమాతో సినీగీత రచయితగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన తరువాత 2011లో ‘పోరు తెలంగాణ’ సినిమాలో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా!’ అనే పాటకు నంది పురస్కారం వరించింది. [2]
పని చేసిన సినిమాలు
[మార్చు]- ధైర్యం (2005) - ‘బైపీసీ బద్మాష్ పోరి బాగుంది మామో’
- పోరు తెలంగాణ (2011) - ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా!’
- రాజన్న (2011) - ‘కాలిగజ్జె ఘల్లుమంటె పల్లెతల్లి మేలుకుంటదో ఓ అమ్మలారా! అక్కలారా!’
- జై తెలంగాణ (2012) - ‘ఆకలి కడుపులు.. చీకటి గడపలు.. ఇంకా ఎంత కాలం?
- భిక్కు రాథోడ్ (2012) - ‘పదరా పదరా.. ఈ కాలం కన్నా వేగంగా..’
- లవ్ అంటే (2013) - ‘మనసే కోరిందిలే నీ చెలిమినే.. ప్రతి జన్మకే’
- అనగనగా ఒక చిత్రం (2015) - ‘చిట్టి చిట్టి నీ మదిని చుట్టు ముట్టి’
- తుపాకీ రాముడు (2019) - ‘కొమ్మా కొమ్మాలొ వెన్నెలగాసే అమ్మా నీ కోసం’
- జార్జిరెడ్డి (2019) - ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్’
- లవ్ స్టోరి (2021) - ‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి నే చిత్తరు వైతిరయ్యో’ [3][4]
- చోర్ బజార్ (2022)
- సింబా (2024)
బతుకమ్మ పాట
[మార్చు]మిట్టపల్లి సురేందర్ 2021లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటను రచించాడు.[5]